ఎన్నారై మహిళ భూమిని కబ్జా చేసిన భాను కిరణ్, వెలుగు చూసిన దారుణం

జిల్లాలోని తలకొండపల్లి మండలంలో ఈ భూమి ఉంది. 25 ఎకరాల భూమిని ఆయన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడ ఒక ఎకరా భూమి 20 లక్షల వరకు ఉంటుంది. తలకొండపల్లి మండలం చల్లంపల్లి గ్రామ పంచాయతీ టాక్‌రాజ్‌గూడలో ఉన్న 25.23 ఎకరాల భూమిని 2007లో బాను తన పేరిట మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ గ్రామానికి ప్రస్తుతం సర్పంచ్‌గా ఉన్న పర్వతాలు యాదవ్ కుటుంబం ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సునీతారెడ్డి పేరుపై ఆమె తండ్రి కొన్నారు. ఆ తర్వాత సునీత అమెరికా వెళ్లి పోయింది. ఆ తర్వాత పైనాన్సు వ్యాపారాల్లో నష్టం కారణంగా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
దాంతో ఆ భూమిని 2006లో కడప జిల్లా పులివెందులకు చెందిన కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి తమ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలల్లో ఆ భూమి భానుతో పాటు మరోవ్యక్తి పేరుపైకి ఆ భూమి మారిపోయింది. అయితే కృష్ణ, ప్రభాకర్ రెడ్డిలపై భూమి రిజిస్టర్ కావడానికి కూడా భానుయే కారణమని అంటున్నరు. మొదట తనపైన రిజిస్టర్ చేయించుకోకుండా దానిని వారిద్వారా తన పేర చేయించుకున్నారు. అయితే భూమి రిజిస్టర్ చేయడాన్ని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు అప్పట్లో అడ్డుకున్నట్టు కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications