తెలంగాణపై రెండు నెలల్లో నిర్ణయం, చిరు స్థితే జగన్‌ది: జైపాల్ రెడ్డి

మర్రి చెన్నారెడ్డి మాదిరిగా తాను అపవాదులు తెచ్చుకోదలుచుకోలేదని, అందుకే ముఖ్యమంత్రి పదవిని తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమర్థుడైన నాయకుడని, అందుకే పార్టీని నిలబెట్టుకోగలుగుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ ఓట్లనే చీలుస్తారని, అయితే అధికారంలోకి రాలేడని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ది ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పరిస్థితేనని ఆయన అన్నారు.
సీమాంధ్రులను సంతృప్తిపరచడానికే అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేశారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications