తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదే చిక్కుముడి: జైపాల్ రెడ్డి

S Jaipal Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదే ఓ చిక్కుముడి అని తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబులతో భేటీ అనంతరం ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదారాబాద్ సమస్యగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. సీమాంధ్ర నాయకుల్లోనూ పునరాలోచన ప్రారంభమైందని ఆయన చెప్పారు.

తెలంగాణపై కాంగ్రెసు క్షీరసాగర మథనం చేస్తోందని, అందులో ఆలస్యమైనా అమృతం వస్తుందని ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. తెలంగాణపై ప్రతిష్టంభన నెలకొన్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. పునాదుల్లోకి తెలంగాణవాదం చొచ్చుకుపోయిందని ఆయన అన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది, తెలంగాణ పార్లమెంటు సభ్యులు తక్కువ మంది ఉన్నారని, ఇది కూడా సమస్యకు ఓ ప్రధాన కారణమని ఆయన అన్నారు. సంక్రాంతి పర్వదినం తర్వాత తమకు సోనియా ఆపాయింట్‌మెంట్ ఇప్పించాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+