తెరాసలో చేరడం లేదు, అన్నీ ఊహాగానాలే: నాగం జనార్దన్ రెడ్డి

తన ప్రయత్నమంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమేనని ఆయన చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరిలతో కలిసి తాను తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వ్యతిరేకించి విడిగా తెలంగాణ ప్రాంత నాయకులతో ఆదివారం నాగం జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చీలిక వస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డిని తెరాసలోకి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications