పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకు భాను కిరణ్ పెట్టుబడులు?

భాను కిరణ్‌కు చెందిన ల్యాప్ టాప్ ద్వారా పోలీసులకు చాలా సమాచారం తెలిసినట్లు ప్రచారం జరుగుతోంది. భాను కిరణ్ వద్ద కొంత మంది వర్ధమాన తారల చిరునామాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. సూరిని భాను కిరణ్, మధుమోహన్ రెడ్డి కలిసే హత్య చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సూరి అనుచరుడు వాసుదేవ రెడ్డి ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. సూరిని పరిటాల రవి వర్గానికి చెందినవారు హత్య చేయలేదని అంటున్నాడు. తన రహస్యాలు బయటపడుతాయని భయపడి వారిద్దరు కలిసి సూరిని హత్య చేశారని అంటున్నాడు. సూరితో పాటు ఆ రోజు సుధీర్ వస్తానంటే భాను ఆపేశాడని, గన్‌మన్ మన్మోహన్‌ను బైక్‌పై వెనక రావాలని చెప్పాడని, దీన్ని బట్టి ముందుకు వేసుకున్న పథకం ప్రకారమే సూరిని భాను, మధులు హత్య చేశారనే అనుమానాలు కలుగుతున్నాయని అతను మీడియాకు చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications