సీమాంధ్రుల చెరలో తెలంగాణ ఎమ్మెల్యేలు: జెఏసి చైర్మన్ కోదండరామ్

సంక్రాంతి పండుగ తెలంగాణకు కీడు పండుగ అని అన్నారు. అదే సంక్రాంతి పండుగ ఆంధ్రా వారికి మంచి పండుగ అని చెప్పారు. సంక్రాంతి వరకు తెలంగాణకు కీడు దినాలు కాబట్టి ఉద్యమాన్ని అప్పటి వరకు తీవ్రతరం చేయమని చెప్పారు. పండుగ తర్వాత కీడు దినాలు వెళ్లిపోతాయని ఆ తర్వాత 16వ తేదినుండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తున చేస్తామన్నారు. కాగా కలెక్టరేట్ ముట్టడి ధర్నాలో కోదండరామ్ పాల్గొన్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications