గవర్నర్ తీరు రాష్ట్రపతి పాలనను తలపిస్తోంది: టీఆర్ఎస్

Naini Narasimha Reddy
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని కలెక్టరేట్ వద్ద ధర్నాలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు నాయిని నరసింహారెడ్డి సోమవారం అన్నారు. తెలంగాణలోని పోలీసు బలగాలను చూస్తుంటే రాష్ట్రపతి పాలనను తలపిస్తున్నాయన్నారు. అందువల్ల కొత్తగా రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ వచ్చే నష్టమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను ప్రభుత్వం మోహరించిందన్నారు.

రాష్ట్రాన్ని పాలిస్తున్నది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాదని, గవర్నర్ నరసింహన్ అని ఆరోపించారు. పాలనలో ముఖ్యమంత్రి అడ్రస్ కరువయిందన్నారు. తెలుగుదేశం పార్టీ తీరు తెలంగాణకు అవమానంగా ఉందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ విమర్శించారు. ఇప్పటికైనా వారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి మెత్తబడిందన్న వార్తలను మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మాత్రమే ఇది అని అన్నారు. సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి వారిని పంపించే రోజు త్వరలో వస్తుందన్నారు. తెలంగాణ తెలుగుదేశం నేతలుకు సిగ్గు ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమించాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నాయకులను, తెరాస నాయకుడు చంద్రశేఖర్, బిజెపి నేత దత్తాత్రేయ, తెలంగాణ జాగృతి నేత కవితను, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+