కెసిఆర్ మౌనం వెనక వ్యూహం ఏమిటి, దేనికి సిద్ధపడుతున్నారు?

ఆందోళన కార్యక్రమాల్లో ఆయన పాత్ర పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణ రాజకీయ జెఎసి అధ్యక్షుడు కోదండ రామ్ అన్నీ తానే అయి పనిచేసుకుంటూ పోతున్నారు. ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునివ్వడం, వాటిని సమన్వయం చేయడం కోదండరామ్ ప్రధాన బాధ్యతగా చేపట్టారు.
తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చారు. 15 రోజుల తర్వాత ఏం చేయాలనే విషయంపైనే ఆయన దృష్టంతా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా, తెలంగాణ బంతిని ఆయన కాంగ్రెసు కోర్టులో పడేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే రాజీనామాలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు.
ఏం చేయాలో పాలుపోక వారు ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులను ఇరికించడంలో కెసిఆర్ విజయం సాధించారనే చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన స్థితిలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పడ్డారు. దీంతో కెసిఆర్ ఊపిరి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications