వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంపీల హెచ్చరికలకు దిగొచ్చిన హైకమాండ్: ఢిల్లీకి పిలుపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: తెలంగాణ పార్లమెంటు సభ్యులకు కాంగ్రెసు అధిష్టానం నుండి మంగళవారం పిలుపు వచ్చింది. ఎంపీలు అందరూ బుధవారం రాత్రి 7 గంటలలోపు న్యూఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పార్లమెంటు సభ్యులందరికీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కాంగ్రెసు పార్టీకి చెందిన అందరూ ఎంపీలు ఢిల్లీలో తప్పుకుండా ఉండాలని ఆయన వారికి చెప్పారు. రాత్రి 7.30 గంటలకు ట్రబుల్ షూటర్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రకటించకుంటే రాజీనామాలకు సిద్ధపడుతున్న ఎంపీలను బుజ్జగించే ప్రయత్నాలు చేయడానికే పిలుపు వచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు.

తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటి సమర్పించిన నివేదిక, భవిష్యత్తు కార్యాచరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికే ఈ పిలుపు అని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రం నివేదికను పక్కకు పెట్టి తెలంగాణ ప్రకటించకుంటే రాజీనామాకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు చెందిన పార్టీ నేతలంతా మంగళవారం సాయంత్రం కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే ఏం చేద్దామనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది.

ప్రణబ్‌తో సమావేశంలో అధిష్టానం వారికి కొన్ని సూచనలు చేసే అవకాశముంది. పార్టీకి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని చెప్పే అవకాశముంది. నివేదిక అనంతరం తెలంగాణ పరిస్థితులపై, వారి అభిప్రాయాలు అధిష్టానం తీసుకొని వారికి రాజీనామాలు వద్దని సూచించే అవకాశముందని తెలుస్తోంది. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే గతంలోలాగా అందరమూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతామని సీమాంధ్ర ఎంపీలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ఎంపీలను పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X