ఎన్నికల తర్వాత వైయస్ జగన్ కనుమరుగవుతారు: తులసీ రెడ్డి
Districts
oi-Srinivas G
By Srinivas
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆస్తులకు మాత్రమే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి వారసుడు అని కాంగ్రెసు అధికార ప్రతినిధి ఎన్ తులసీరెడ్డి బుధవారం గుంటూరులో వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు మాత్రం కేవలం కాంగ్రెసు కార్యకర్తలు మాత్రమే వారసులని చెప్పారు. ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని మంగళవారం న్యూఢిల్లీ జలదీక్షలో వ్యాఖ్యానించిన వైయస్ జగన్ కు దమ్ముంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ చేశారు. జగన్ ప్రభావం కేవలం ఎన్నికల వరకే ఉంటుందన్నారు. ఆ తర్వాత జగన్ కనుమరుగు కావడం ఖాయమని చెప్పారు.