గుంటూరులో తెలుగుదేశం ఫ్లెక్సీని చించిన వైయస్ జగన్ వర్గం
State
oi-Srinivas G
By Srinivas
గుంటూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి అనుచరులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీని ధ్వంసం చేయటంతో సోమవారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని తుబాడు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగన్ వర్గంగా భావిస్తున్న కొందరు టిడిపికి చెందిన ఫ్లెక్సీని చించారు. దీంతో ఆగ్రహం చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయింది. పోలీసులు వచ్చి ఇరువర్గాల వారని వారించారు.