హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని పరిగి మండలానికి చెందిన ప్రేమజంట ఈ దారుణానికి పాల్పడింది. పరిగికి చెందిన తాహెరాగా, పరిగి మండలం మిట్టగోడూరుకు చెందిన వెంకటేష్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు పెద్దలు ససేమీరా అనడంతో వారు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు ఒకే ఇంటిలో పరిగిలోని బోయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువతి పురుగుల మందు తాగగా, అతను ఉరేసుకొని చనిపోయాడు.