అధిష్టానం బుజ్జగింపులకు లొంగం: ఎంపీ పొన్నం ప్రభాకర్

పార్టీని ఒప్పించి తెలంగాణను సాధించుకుంటామన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీని బలోపేతం చేస్తామన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణపై కూడా రాజకీయాలు అల్లుతున్నారన్నారు. మంత్రివర్గ విస్తరణ, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదన్నారు. తెలంగాణకు చెందిన కొందరు ఎంపీలకు మంత్రి పదవులు వస్తే వారు ఉద్యమంలో భాగంగా అవసరమైన సమయంలో పదవులు త్యజిస్తారని చెప్పారు. తాము డిసెంబర్ 9న చిదంబరం ప్రకటించిన తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగణ తప్ప మాకు ఏదీ అవసరం లేదని చెప్పారు. మా ప్రాంత ప్రజల అభిష్టం ప్రకారమే మేం నడుచుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications