నాగం జనార్దన్ రెడ్డిపైనే తెలుగుదేశం నేత బాబూ మోహన్ గురి?

పార్టీని చీల్చాలని ప్రయత్నిస్తున్న నాయకుడు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, నాగం జనార్దన్ రెడ్డిని ఉద్దేశించే బాబూ మోహన్ ఆ వ్యాఖ్య చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణపై స్వతంత్రంగా ఉద్యమించాలని భావిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు గత కొద్ది కాలంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బాబూ మోహన్‌ను ఆయన రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు. తన రాజీనామా లేఖను జెఎసి కన్వీనర్ కోదండరామ్‌కు ఇస్తానని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి అనడం కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. గతంలో దేవేందర్ గౌడ్ మాదిరిగా ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు చూస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications