అనీతిపరులు సమర్థులుగా గుర్తింపు పొందుతున్నారు: చంద్రబాబు

సంపదను దోచుకుంటున్నారని, విదేశాల్లో దాచుకుంటున్నారని, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆయన కాంగ్రెసు నాయకులను ఉద్దేశించి అన్నారు. చదువుకున్నవారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీ రామారావుదని ఆయన అన్నారు. ఎన్ని ఒడిదొడుకులు, సవాళ్లు ఎదురైనా ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన ముహూర్తబలం తెలుగుదేశం నిలబడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. తమకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా ఉందని, కానీ తమకు ఆ ఉద్దేశం లేదని పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. పార్టీ కోసం పనిచేసినవారికి ఎన్టీఆర్ గుర్తింపు ఇచ్చేవారని, ఈ విషయంలో పార్టీ పునరాలోచన చేయాలని తెలుగుదేశం నాయకుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు.












Click it and Unblock the Notifications