కేంద్ర మంత్రిగా ఉండి జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారు: ఈటెల

తెలంగాణ కోసం ఈ నెల 21వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీన విద్యార్థుల సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు చెందిన అన్ని విద్యార్థి సంఘాలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. జనవరి 29వ తేదీన నుంచి విద్యార్థి జెఎసి తరఫున తెలంగాణలో బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఈ నెల 28వ తేదీన విడుదలయ్యే జై బోలో తెలంగాణ సినిమాను తెలంగాణకు చెందిన అందరూ చూసేలా పార్టీ నాయకులు చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. విద్యార్థుల బస్సు యాత్రలు పది, 12 రోజుల పాటు సాగుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications