ఎన్టీఆర్ తర్వాత జగనే కాంగ్రెసును ఎదుర్కుంటున్నారు: లక్ష్మీపార్వతి

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మంచి వనరులు ఉన్నాయన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ దానిని ఉపయోగించుకోలేక పోతోందన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశానికి మంచి కార్యకర్తలను సంపాదించి పెట్టారన్నారు. అయితే ఇప్పుడున్న వారు తెలుగుదేశానికి ఉన్న వనరులను ఉపయోగించుకోలేక పోతున్నారని అన్నారు. పార్టీలో నాయకత్వ లేమి ఉందన్నారు. సరియైన నాయకుడు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమవుతుందన్నారు. సరియైన నాయకుడు ఉండే తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండదన్నారు.
కాగా మంగళవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అయితే తెలుగు తమ్ముళ్లు ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశాన్ని, ఎన్టీఆర్ పేరును లక్ష్మీపార్వతి మంట గలుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications