వైయస్ జగన్‌ లో పరివర్తన వస్తేనే వైయస్సార్ ఆత్మకు శాంతి: శంకర్రావు

P Shankar Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌లో పరివర్తన రావాలని తాను కోరుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత మంత్రి పి. శంకర రావు అన్నారు. వైయస్ జగన్‌లో పరివర్తన వచ్చి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి విధేయుడిగా మారితే వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతిస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ వల్ల ఏదో అవుతుందనే విషయంలో నిజం లేదని, తెలంగాణ అభివృద్ధి జరగాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పదే పదే రాజీనామాలతో ప్రజలను విసిగించవద్దని ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఎవరూ రాజీనామాలు చేయకూడదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారి ఆత్మలు నెహ్రూ కుటుంబాన్ని కరిగిస్తాయని, దాంతో తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పదవులు తీసుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. పదవులు తీసుకుని వారు తెలంగాణ కోసం కృషి చేయకపోతే తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని ప్రజలే తీర్పు చెప్పారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+