మరోసారి అఖిలపక్షం అవసరం లేదు, మేం దూరం: రేవూరి ప్రకాశ్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ అంశాన్ని వదిలేసి పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. వారు పదవుల వ్యామోహం మాని తెలంగాణ కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 20వ తారీఖునుండి టిడిపి తెలంగాణ కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుందని ప్రకటించారు. కాగా అఖిలపక్షం నిర్వహించడం ద్వారా కేంద్రం తెలంగాణ అంశాన్ని ఇతర పార్టీలపైకి నెట్టాలని చూస్తుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇంతకుముందు అఖిలపక్షం నిర్వహించిన కేంద్రం తెలంగాణ అపవాదును రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీపైకి నెట్టడంతో తెలంగాణను టిడిపి అడ్డుకున్నదనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications