కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్ జగన్ శిబిరం రహస్య భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు రహస్యంగా భేటీ ఆయ్యారు. జిల్లాలో జగన్‌కు మద్దతునిస్తున్న ఆదినారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసులు, కమలమ్మ, అమరనాథ్‌రెడ్డిలతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, పిసిసి జిల్లా నాయకుడు సురేష్ తదితరులు రహస్యంగా బేటీ అయినట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యేతో పాటు ఇంఛార్జ్ మంత్రిగా నియమించిన కన్నా లక్ష్మీనారాయణను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై వారు చర్చించినట్టుగా తెలుస్తోంది.

మైదుకూరు ఎమ్మెల్యే, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి జగన్ వర్గానికి సవాలు మీద సవాలు విసురుతున్నారు. ఈ విషయంపై కూడా వారు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ డిఎల్‌లతో సహా రాజీనామాకు సిద్ధమైతే మళ్లీ గెలుస్తారా లేదా అనే విషయాన్ని కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మళ్లీ గెలవలేమనే కడప జిల్లా జగన్ వర్గం ఎమ్మెల్యేలు డిఎల్ సవాలుకు వెనక్కి తగ్గినట్టుగా వార్తలు వస్తున్ననేపథ్యంలో వారు ఈ విషయాన్ని చర్చించారు. పులివెందులలో గానీ, కడపలోగానీ జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందే స్వయంగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆయనను ఎలా ఎదుర్కోవాలా అనే విషయంపై చర్చించారు.

ఉప ఎన్నికలతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత జిల్లాకు వచ్చిన నిధులు, అభివృద్ధి పనులను సమీక్షించి వాటిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించిగా తెలుస్తోంది. వైయస్ అకాల మృతి తర్వాత కడప జిల్లా అభివృద్ధికి దూరమయిందనే భావన జిల్లా ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జగన్ వర్గంలో ఉన్న వారు స్థానికంగా పట్టు ఉన్న జెడ్పీటీసులు, ఎంపీటీసీలను జగన్ వర్గంలో చేర్చే విధంగా ప్రయత్నాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X