కడప జిల్లాలోనూ నిర్మాత శింగనమల రమేష్ ఘనకార్యం

ప్రొద్దుటూరులో ఐదుగురు వ్యక్తులకు రమేష్ రూ.30లక్షలు ఇవ్వాల్సి ఉండగా చెల్లని చెక్కులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ప్రొద్దుటూరు అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మరో ఐదుగురి రూ.16 లక్షలకు సంబంధించి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వీరు కోర్టులో కేసు వేశారు. ఈ న్యాయవాది వద్ద ఎనిమిది చెక్కుబౌన్సు కేసులు ఉన్నాయి. మరో రూ.5 లక్షలకు సంబంధించి రమేష్ ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో బాధితులు కోర్టులో మూడు కేసులు వేశారు. వీటన్నంటికీ సంబంధించి రమేష్ కు కోర్టు ద్వారా సమన్లు పంపగా ఈయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నట్లు తెలిసింది. రమేష్ రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని చెల్లించకపోవడంతో ఓ వ్యాపారి ప్రొద్దుటూరు కోర్టులో సివిల్ కేసు వేశారు. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications