తెలంగాణలో రచ్చబండ రచ్చరచ్చ: మంత్రులకు తెలంగాణ సెగ

రంగారెడ్డి జిల్లా కాప్రాలో మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణవాదుల నుంచి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆయనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయాలని వారు మంత్రులను డిమాండ్ చేశారు. కాగా, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం నుంచి ఆయనను బయటకు రానీయలేదు. వరంగల్‌లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ తెలంగాణవాదుల వ్యతిరేకతను ఎదుర్కున్నారు. వారి కాన్వాయ్‌ని వారు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications