జగన్‌కు ముఖ్యమంత్రి స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు: వి హనుమంతరావు

V Hanumantha Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి, ఆయన వర్గానికి స్ట్రాంగ్ డోస్ ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆదివారం వ్యాఖ్యానించారు. జగన్‌పై ముఖ్యమంత్రి బాగా స్పందించారని మెచ్చుకున్నారు. ఇకనుండి మంత్రులు కూడా జగన్‌పై స్పందిస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం లేక జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తుందనే ఆరోపణలు ఆయన కొట్టి పారేశారు.

బలం లేక ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే వార్తల్లో నిజం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బలం ఉందన్నారు. వారు బయటకు వెళ్లినా ప్రభుత్వానికి సమస్య లేదన్నారు. మాకున్న బలాన్ని దుర్వినియోగం చేయవద్దనే వారిపైన చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సదరు ఎమ్మెల్యేల్లో మార్పు వస్తుందేమోనని చూస్తున్నారని అంటున్నారు. జగన్ వెంట వెళుతున్న వారంతా బలం లేని వారేనని అన్నారు. వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

జగన్ వాపును చూసి బలుపు అని అనుకుంటున్నారని ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో గెలిచిన వారంతా కాంగ్రెస్ దయపైన గెలిచారని, ఏ ఒక్క వ్యక్తివల్లో గెలవడం కాదన్నారు. పార్టీ గుర్తుపైనే గెలిచి వారు ఇప్పుడు పార్టీపైనే తొడలు కొడుతున్నారన్నారు. ఇది సరియైననది కాదన్నారు. కాగా రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావును విహెచ్ కోరారు. తెలంగాణకు, రచ్చబండకు ముడి పెట్ట వద్దన్నారు. పలువురు సీమాంధ్ర ఎంపీలు కూడా విడిపోయి ఐక్యంగా ఉందామని అధిష్టానానికి సూచించారని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ భరద్వాజ్‌ను బిజెపి కాంగ్రెస్ ఏజెంట్ అనడాన్ని కూడా ఆయన ఖండించారు. అవినీతిపరులపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+