వైయస్ జగన్‌కు ఐటి శాఖ షాక్: రూ.280 కోట్లు కట్టాలని నోటీసులు?

సాక్షి సంస్థల్లోకి రకరకాల అక్రమ మార్గాల్లో భారీగా పెట్టుబడులు ప్రవహించినట్లు ఆరోపణల నేపథ్యంలో జగన్ సంస్థల వ్యవహారాలపై వివిధ కేంద్ర ద ర్యాప్తు సంస్థల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జగన్ మీడియాకు ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసిన విషయం ఢిల్లీ పెద్దల దృష్టికి వచ్చింది. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ సంస్థల్లో పెట్టుబడులపై అందిన ఫిర్యాదుల ఆధారంగానే ఐటీ అధికారులు తీగ లాగారు. జగన్ 2004లో సాండూర్ పవర్ కంపెనీ అనే ఖాయిలా పడ్డ సంస్థను కొనుగోలు చేశారు. అందులో వాటాలను మారిషస్‌కు చెందిన 2ఐ కాపిటల్, ప్లూరీ ఎమర్జింగ్ అనే రెండు కంపెనీలకు విక్రయించారు. ఇలా సేకరించిన నిధులను ఇతర అనుబంధ కంపెనీలను ప్రమోట్ చేయడానికి ఉపయోగించింది.
సాండూర్ పవర్‌కు క్లాసిక్ రియాల్టీ, కార్మెల్ ఆసియా, భగవత్ సన్నిధి ఎస్టేట్స్, హరీశ్ ఇన్ఫ్రా అనే నాలుగు అనుబంధ కంపెనీలున్నాయి. అందులో క్లాసిక్ రియాల్టీకి మరో మూడు అనుబంధ సంస్థలున్నాయి. ఇలా ఒకదానికొకటి లింకు కంపెనీలు ఉన్నాయి. ఇలా జగన్ ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలే సాండూర్ పవర్ నుంచి తక్కువ ధరకు వాటాలను కొన్నాయి. ఇవే వాటాలను తిరిగి గిలిక్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా సిమెంట్స్, జీఆర్ ఇంట్రాకెమ్, పయనీర్ ఇన్‌ఫ్రా, పెన్నార్ సిమెంట్స్, హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా, ఇందూ ప్రాజెక్ట్స్ వంటి కంపెనీలకు అత్యధిక ధరలకు అమ్ముకొని వాటి ద్వారా ఆర్జించిన డబ్బులతోనే సాక్షి పత్రిక, సాక్షి టెలివిజన్‌కు పెట్టుబడులకు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భారీ మొత్తాల్లో అక్రమాదాయం ఉందని ఐటీ అధికారులు గుర్తించి లెక్కతోలని వాటికి 280 కోట్ల పన్ను కట్టాల్సిందిగా నోటీసులు పంపినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications