ఎదురుకాల్పుల్లో ప్రజా ప్రతిఘటన దళ కమాండర్ సురేష్ మృతి
Districts
oi-Srinivas G
By Srinivas
ఖమ్మం: ఖమ్మం జిల్లా మరోసారి ఎదురు కాల్పులతో మారు మ్రోగింది. జిల్లాలోని ఆళ్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దట్టమైన అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ప్రజాప్రతిఘటన దళ కమాండర్ సురేశ్ మృతి చెందినట్లుగా సమాచారం. ఆళ్లపల్లి అడవుల్లో నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా నక్సలైట్లు ఎదురుపడి కాల్పులు జరిపారు.
దీంతో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు సంఘటనాస్థలం నుంచి పోలీసులు రెండు తుపాకులతో పాటు, ఒక కిట్‌ను స్వాధీనం చేస్కున్నట్టుగా తెలుస్తోంది.