చంద్రబాబు దెబ్బకు దిగొచ్చిన తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో తాము చేయాల్సిన పోరాటంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లుకోసం ఢిల్లీపై ఒత్తిడి తేనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆందోళనలు ఉంటాయని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం మండలస్థాయి నుంచి కార్యకర్తలు పోరాటాలు చేస్తారని ఆయన చెప్పారు. కాగా, తీవ్రంగా విభేదించిన మోత్కుపల్లి నరసింహులుతో నాగం జనార్దన్ రెడ్డికి సయోధ్య కుదిరింది. నాగం జనార్దన్ రెడ్డి తీరుపై ఇటీవల మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications