విశాఖపట్నంలో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం
National
oi-Pratapreddy
By Pratap
విశాఖపట్నం: విశాఖపట్నంలో స్పైస్ జెట్ విమానానికి మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. దాంతో విమానాన్ని విశాఖపట్నం విమానాశ్రయంలో నిలిపేశారు. విమానంలో 60 మంది ప్రయాణికులున్నారు. ముంబై నుంచి బయలుదేరి విమానం హైదరాబాదు మీదుగా విశాఖపట్నం చేరుకుంది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకి వెళ్లాల్సింది. అయితే, ప్రమాదం కారణంగా విశాఖలో ఆగిపోయింది..
విమానం రెండు పక్షులను ఢీకొట్టింది. దీంతో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. పక్షుల శరీర భాగాలు విమానం ఇంజన్‌లో ఇరుక్కుపోయాయి. దీంతో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది.