కృష్ణా జిల్లాలో వికటించిన పోలియో చుక్కలు: 30 మందికి అస్వస్థత

Krishna Dirstricts Map
విజయవాడ: పోలియో చుక్కల మందు వికటించి 30 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటన కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి మండలం చేవూరిపాలెంలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన చిన్నారులను దగ్గరలోని గుడివాడ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు అస్వస్థతకు గురి కావడానికి పోలియో చుక్కలే కారణమని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 23వ తారీఖుల అక్కడ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆ పోలియో చుక్కలు వికటించి అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.

కాగా మంగళవారం రాత్రి శరణ్య అనే ఏడాది చిన్నారి మరణించింది. శరణ్య మరణానికి కారణం పోలియో చుక్కలు వికటించడమేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా పోలియో చుక్కలు వికటించడమనేది ఉండదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శాలినిదేవి అన్నారు. పోలియో చుక్కల వల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలు రావన్నారు. అయితే చిన్నారుల్లో అస్వస్థతతకు గల కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+