అక్రమ డబ్బుతో కొవ్వెక్కి దీక్షలు: జగన్ పై గాలి ముద్దుకృష్ణమ ఫైర్

జగన్ ఆస్తులపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు స్పందించటం లేదన్నారు. ఆయన ఆస్తులపై విచారణ చేయించకపోవడానికి గల కారణాలు ఏమిటో ప్రజలకు తెలియాలన్నారు. ఆయన అక్రమ ఆస్తులలో సోనియాకు వాటా ఉందని అందరూ భావిస్తున్నారన్నారు. ఆ కారణంగానే ఆమె జగన్‌పై విచారణ చేయించలేక పోతుందని అనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, జగన్ ఇద్దరూ ఇద్దరే అని విమర్శించారు. జగన్, కాంగ్రెస్ నిత్యం టిడిపిపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.
కాగా ప్రభుత్వం మాజీ ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రారావుపై వెంటనే స్పందించాలని టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో అన్నారు. కెవిపి దుబాయ్‌లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఆయనను రప్పించాలన్నారు. ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలన్నారు. కెవిపి ఆస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications