ముఖ్య అనుచరులతో వైఎస్ జగన్ భేటీ: హాజరైన భూమా దంపతులు
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్య అనుచరులతో బుధవారం హైదరాబాదులోని తన ఇంట్లో భేటీ అయ్యారు. పార్లమెంటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, బాబూరావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, శేషారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, పేర్ని నాని, శాసనమండలి సభ్యులు కొండా మురళీధరరావు, ప్రజారాజ్యం పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి తదితరులు భేటీ ఆయినట్లుగా సమాచారం. కాగా జగన్ తన భవిష్యత్తు కార్యాచరణపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.