హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చవటలు, దద్దమ్మలు కాకపోతే ఏమనాలి: కాంగ్రెసు ఎమ్మెల్యేలపై కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: "ప్రాణాలకు తెగించి దీక్ష చేసినా.. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వస్తే కాపాడుకోలేకపోయారు. ఇలాంటి నాయకుల్ని చవటలు, దద్దమ్మలనక ఇంకేమనాలి?" అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు కాంగ్రెస్‌ నేతలపై ధ్వజమెత్తారు. ''డిసెంబరు 31 తర్వాత రాజీనామాలు చేస్తామన్న నాయకులు.. ఇప్పుడు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందా? అని అడుగుతున్నారు. ముందు మీరు (కాంగ్రెస్‌ నేతలు) రాజీనామాలు చేయండి.. తెలంగాణ ఎందుకు రాదో చూస్తా'' అని సవాల్‌ విసిరారు. వరంగల్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మొగుళ్ల రాజిరెడ్డి బుధవారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటైన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబరు 9న కేంద్రహోంమంత్రి చిదంబరం ప్రకటించిన వెంటనే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాత్రికి రాత్రి ఒక్కటై, రాజీనామాలు చేశారని, తెలంగాణ నేతలు ఇంకా పదవుల కోసమే పాకులాడుతున్నారని మండిపడ్డారు. మనలో ఐక్యత లోపించడమే తెలంగాణకు అడ్డంకిగా మారిందన్నారు.

రచ్చబండను అడ్డుకోవడం ద్వారా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య, ఇంకొందరు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణ ప్రాంతానికి నీళ్లేవీ? నల్గొండలో ఫ్లోరైడ్‌ ఎందుకుంది? అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లకు తొత్తులుగా మారి చెంచాగిరి చేసే ఇలాంటి మంత్రులు ఉంటే ఏంది.. లేకుంటే ఏంది? అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, తెలంగాణ నాయకులంతా పార్టీలను పక్కనబెట్టి ఐకమత్యాన్ని ప్రదర్శించాలని కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో పదివేల గ్రామాల్లో ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, అది చూసైనా కాంగ్రెస్‌ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే జిల్లాకు 10 వేలు చొప్పున లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X