హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్: ఎమ్మెల్యేలతో మాటామంతీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను కౌంటర్ చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బలమైన వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులను వెనక్కి రప్పించేందుకు వారితో మాట్లాడుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో వైయస్ జగన్‌కు ఎదురు దెబ్బ తగులుతోంది. జగన్ చేతి నుంచి జారిపోతున్న శాసనసభ్యుల్లో తాజాగా మరో ఇద్దరు చేరారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని జగన్‌వర్గ ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు బుధవారం కలిశారు. వారిని ఖమ్మం జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చారు. తమకు సరైన ప్రాధాన్యం ఇస్తే కాంగ్రెసులోనే కొనసాగాల్సిందని స్పష్టం చేశారు. అదే విధంగా తన సొంత జిల్లా చిత్తూరులో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, రవిలను బుజ్జగించే బాధ్యతను మంత్రి రఘువీరారెడ్డి తన భుజానికెత్తుకున్నారు. కుతూహలమ్మ తనతో సీఎం నేరుగా మాట్లాడాలని డిమాండ్ చేస్తే రవి మాత్రం మెత్తపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి.

బుధవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంత్రి రఘువీరారెడ్డిని పూతలపట్టు ఎమ్మెల్యే రవి కలిశారు. తన నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణకుమారి జోక్యం చేసుకుంటూ పరిశ్రమ పేరిట పేదల భూములు లాక్కుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రఘువీరారెడ్డి వద్ద రవి ఆవేదన వ్యక్తంచేశారు. క్వారీని ఒక పేద రైతు లీజుకు తీసుకుంటే ఆ క్వారీకి రోడ్డు లేకుండా మంత్రి అరుణ చేశారన్నారు. ఈ అంశంపై తాను న్యాయపోరాటం కోసం మాజీ మంత్రి పెద్దిరెడ్డిని ఆశ్రయించానని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనను కలసి జగన్ వర్గంలోకి ఆహ్వానించారని రవి చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యులేనని రవిని అనునయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X