సిఎం తెలంగాణ రచ్చబండ రసాభాస: ఉద్రిక్తత మధ్య ముగించిన కిరణ్

దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సిఎం ప్రసంగించారు. రచ్చబండను అడ్డుకున్నా ఆగదని చెప్పారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి విషయంలో రాజీ లేదన్నారు. రచ్చబండను అడ్డుకున్న చోట మళ్లీ చేపడతామని చెప్పారు. రచ్చబండ అభివృద్ధి కార్యక్రమమని దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. మొత్తానికి సిఎం రచ్చబండ కార్యక్రమాన్ని తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగించారు. కాగా ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణవాదుల అరెస్టుకు నిరసనగా మహబూబ్‌నగర్లో ఐదు బస్సులను, మూడు కార్లను ధ్వంసం చేశారు. డిఎస్పీ వాహనంపై కూడా దాడి చేశారు.












Click it and Unblock the Notifications