రచ్చబండలో లోక్‌సత్తా జెపిని అడ్డుకున్న తెలంగాణవాదులు, అరెస్టు

ముషీరాబాదులో కూడా రచ్చబండ కార్యక్రమం పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ శాసనసభ్యురాలు మణెమ్మను మాజీమంత్రి నాయిని నరసింహారెడ్డి పలువురు తెలంగాణవాదులతో కలిసి అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ముషీరాబాదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మంత్రి ముఖేష్‌గౌడ్‌ను తెలంగాణవాదులు అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డిని కూడా అడ్డుకున్నారు. రాజధాని నగరంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఎమ్మెల్యేలను, మంత్రులను తెలంగాణవాదులు అడ్డుకోవడంతో కార్యక్రమం రచ్చరచ్చ అయింది.












Click it and Unblock the Notifications