తెలంగాణలో అదే రచ్చరచ్చ: సిఎం సభలకు భారీ భద్రత

కాగా తెలంగావాదుల అరెస్టును పలువురు ఖండించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే రచ్చబండ అన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అదే ప్రజలను రాత్రికి రాత్రి అరెస్టు చేయించి రచ్చబండను నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. ఉదయం పది గంటలకు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, మధ్యాహ్నం రెండు గంటలకు నల్గొండ జిల్లాలో సిఎం రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. కాగా వరంగల్ జిల్లా రంగశాయిపేటలో బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్యను భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ అడ్డుకొని జై తెలంగాణ నినాదాలు చేశారు. నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాల్లో అధికారులు రచ్చబండ దగ్గరకు వెళ్లకుండా ప్రజలు అడ్డకున్నారు.












Click it and Unblock the Notifications