అఖిలపక్షం ఏర్పాటులో జాప్యం లేదు, త్వరలో సమావేశం: చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ అంశానికి సంబంధించి కేంద్రం రెండోసారి ఏర్పాటు చేయాలనుకున్న అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి జాప్యం జరగలేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం సోమవారం అన్నారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన తర్వాత జనవరి 6న అఖిలపక్ష సమావేశంలో అందరికీ నివేదికను ఇచ్చామని, ఆయా పార్టీలకు నివేదిక అధ్యయనం చేయడానికి సమయం ఇచ్చామన్నారు. త్వరలో రెండోసారి అఖిలపక్షం ఏర్పాటు చేయడానికి తేదిని ఖరారు చేస్తామని చెప్పారు. భేటీని ఖచ్చింతంగా నిర్వహిస్తామని చెప్పారు.

జనవరి 6వ తారీఖునే మరో భేటీ ఉంటుందని స్పష్టం చేశామని చెప్పామన్నారు. అయితే వారం రోజుల్లో తేదిని ప్రకటిస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో భేటీ జరుగుతుందని చెప్పారు.రెండోసారి భేటీకి అన్ని పార్టీలు హాజరవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 8 పార్టీలు రావాలని ఆయన కోరారు. కేంద్రం కూడా అఖిలపక్షం ఖచ్చితంగా ఉండాలనే యోచిస్తుందన్నారు. కాగా హైదరాబాదులో డిటెక్టివ్ భవనానికి 16 కోట్ల రూపాయలు, జాతీయ విపత్తు నుండి 300 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తున్నట్టు చెప్పారు.

విజిలెన్సు అధికారి థామస్ నియామకంపై చిదంబరం వివరణ ఇచ్చారు. థామస్ నియామకం సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాతే జరిగిందని చెప్పారు.థామస్ కేసు వ్యవహారంపై కేంద్రం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నియమించిందన్నారు. థామస్‌పై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, హోంమంత్రికి తెలియదన్న విషయాన్ని చిదంబరం కొట్టి పారేశారు. పామాలిన్‌పై సుప్రీం స్టే ఇచ్చిందని అ తర్వాత ఆయన నియామకం జరిగిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+