పిసిసి అధ్యక్షుడిగా చిరంజీవి, శాసనసభ స్పీకర్‌గా వంగా గీత?

తమ నేత వైయస్ జగన్ శక్తిని తట్టుకోలేకనే కాంగ్రెసు వైపు చిరంజీవి వెళ్తున్నారని ప్రముఖ సినీ నటి రోజా అన్నారు. చిరంజీవి శాసనసభ్యుల భారాన్ని కూడా మోయలేకపోతున్నారని ఆమె అన్నారు. ప్రజారాజ్యం పార్టీని మాజీ మంత్రి మారెప్ప పీపుల్స్ రిజెక్టెడ్ పార్టీగా అభివర్ణించారు. మే ఐ హెల్ప్ యూ అంటూ చిరంజీవి బోర్డు పెట్టుకుని ఢిల్లీలో తిరగారని ఆయన వ్యాఖ్యానించారు. వంద మంది చిరంజీవులు వచ్చినా వైయస్ జగన్‌ను ఏమీ చేయలేరని అంబటి రాంబాబు గుంటూరులో అన్నారు. కాంగ్రెసులో కలవడానికి చిరంజీవి ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి పరిణామమూ వైయస్ జగన్ వల్లనే చోటు చేసుకుంటోందని ఆయన అన్నారు. చిరంజీవితో కాంగ్రెసు దోస్తీని శాసనసభ్యురాలు కొండా సురేఖ తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications