కాంగ్రెసు పార్టీలో విలీనం దిశగానే పిఆర్పీ అడుగులు, తుది నిర్ణయం చిరుదే

సోనియాతో భేటీలో తమ నుంచి ఏ విధమైన ప్రతిపాదనలు ఉండవని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఆఫర్ల మీదనే చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి రెండు పార్టీలు కలిసి పని చేసే విషయంపై చర్చలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే తాము రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతిచ్చామని, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలని అనుకున్నామని, తర్వాత ఆ విషయం వెనకపడిందని, ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో తాము కాంగ్రెసు పార్టీపై ఒకటి రెండు తీవ్ర వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అది కలిసి పనిచేయడానికి ఆటంకం కాదని ఆయన అన్నారు. ఆంటోనీ స్వయంగా వచ్చి ఆహ్వానించారని, అందువల్ల ఇక్కడ ఒక్కరిద్దరు కాంగ్రెసు నాయకులు వ్యతిరేకించినంత మాత్రాన కలిసి పనిచేసే విషయం వెనక్కి పోదని ఆయన అన్నారు.
Comments
చిరంజీవి ప్రజారాజ్యం సి రామచంద్రయ్య కాంగ్రెసు హైదరాబాద్ chiranjeevi prajarajyam c ramachandraiah congress hyderabad
Story first published: Thursday, February 3, 2011, 14:34 [IST]