టిడిపి ఎంపీ నామా నాగేశ్వరరావుకు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి మద్దతు
Districts
oi-Srinivas G
By Srinivas
|
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇంటిపై, హైదరాబాదు, ఖమ్మం జిల్లాల్లోని ఆయన మధుకాన్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ అధికారులు అకస్మాత్తుగా దాడి చేయడాన్ని కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఖండించటం లేదు. నామాకు తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ నుండి కూడా మద్దతు లభించడం విశేషం. గుంటూరుకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు శుక్రవారం విజయవాడలో నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఐటి దాడులను ఖండించారు.
సామాన్య కుటుంబం నుండి కష్టపడి పైకి వచ్చిన వారిపై ఐటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నామా నాగేశ్వరరావుకు రాజకీయాల్లోకి రాకముందే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. నామాపై ఐటి దాడిని శోచనీయమన్నారు. రాష్ట్రంలో చాలామంది మధుకోడాలు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదాయపన్ను శాఖకు సూచించారు.