హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, ఫిబ్రవరి రెండో వారం నుంచే: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఫిబ్రవరి రెండో వారం నుంచే సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమవుతుందని, ప్రభుత్వంలోని అన్ని రంగాలను స్తంభింపజేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఒక వైపు రావడానికి ఇష్టపడడం లేదని, ఈ స్థితిలో తెలంగాణ ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని ఆయన అన్నారు. పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారులు రామలక్ష్మణ్, గోయల్ శుక్రవారం సాయంత్రం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి కాంగ్రెసు నాయకులు ముందుకు రాకపోవడంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

వలసవాదులు దోచుకోవడానికే వచ్చారని, అయితే ఇంటి దొంగలే పెద్ద సమస్యగా మారారని ఆయన అన్నారు. వచ్చిన తెలంగాణను సీమాంధ్ర రాజకీయ నాయకులంతా ఏకమై అడ్డుకున్నారని, తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రాంత నాయకులు ఒక్కటి కావడం లేదని, రాజీనామాలు చేయాలంటే వెనకాడుతున్నారని ఆయన అన్నారు. ఈ స్థితిలో తెలంగాణ ప్రజలు ఒక్కటవుతున్నారని ఆయన అన్నారు. సమస్యలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు. శంకర్ దర్సకత్వంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాను ఆయన మరోసారి ప్రశంసించారు. సినిమా చూసి సీమాంధ్ర ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా మారుతున్నారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X