పోలవరం కోసం బయలుదేరిన జగన్: ఆహ్వానం పలికిన ఎమ్మెల్యేలు

YS Jagan
రాజమండ్రి: పోలవరం సాధన యాత్ర కోసం తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరిన మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఆయనకు రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, కె శ్రీనివాస్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తదితరులు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వచ్చి జగన్‌కు ఘన స్వాగతం పలికారు.

కాగా శనివారం ఫీజు రీయింబర్స్ మెంటు అందక చనిపోయిందని ఆరోపణలు వస్తున్న వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ ఆదివారం ఉదయం హైదరాబాదునుండి పోలవరం సాధనా యాత్రకు రాజమండ్రికి బయలు దేరి వెళ్లారు. సాగర్ సొసైటీ వద్ద అభిమానులు, కార్యకర్తలు, జగన్ వర్గ నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+