ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక వ్యక్తి చనిపోతే కాలం ఆగదు: వైయస్ మృతిపై సిఎం కిరణ్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఒంగోలు: ఒక వ్యక్తి చనిపోతే కాలం ఆగిపోదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మాచవరంల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు యథాతథంగా అమలవుతాయని ఆయన హామీ ఇచ్చారు. పథకాల అమలులో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతామని ఆయన చెప్పారు. రచ్చబండ కార్యక్రమం వైయస్సార్ ప్రారంభించిందేనని ఆయన అన్నారు. స్మార్ట్ కార్డుల ద్వారా ఎక్కడైనా రేషన్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.

విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. మోపాడు రిజర్వాయర్‌కు 16 కోట్లు, పాలేటిపాడు రిజర్వాయర్‌కు 18 కోట్ల నిధులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు 67 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. చేనేత కార్మికుల రుణమాఫీకి 109 కోట్ల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకుని రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆయన ప్రభుత్వ సిబ్బందిని ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X