చిరు పీఆర్పీని నిమజ్జనం చేశారు, ఆయన నైతికతపై అనుమానం: దాడి

Dadi Veerabhadra Rao
హైదరాబాద్/విజయవాడ: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవి నైతికతపైనే అందరికీ అనుమానం ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సోమవారం అనుమానం వ్యక్తం చేశారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేదని నిమజ్జనం చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో అవినీతి జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చిరుపైనే అనుమానాలు ఆయన మరెవ్వరికో సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన వారిని మామూలుగా వదలవద్దన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపణలు చేసి వారి పంచెలూడదీసి కొట్టాలన్న చిరంజీవి ఇప్పుడు వారి పంచనే చేరి ప్రజలను వంచన చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+