గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిని ఆడిపోసుకున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీం చేయడానికి పూనుకున్న చిరంజీవిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆడిపోసుకున్నారు. ప్రజలకు న్యాయం చేస్తానని రాజకీయాల్లోకి వచ్చి, సామాజిక న్యాయం సాధిస్తానని చెప్పి చిరంజీవి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా పర్యటనలో ఆయన మంగళవారం ఆ వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీ రామారావు ఏ రోజు కూడా కాంగ్రెసు పార్టీతో రాజీ పడలేదని, చిరంజీవి సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి కుంభకోణాల కాంగ్రెసుతో జత కట్టారని ఆయన వ్యాఖ్యానించారు. గంజి, బెంజి రెండూ తెలుసునన్న చిరంజీవి బెంజి కారు వైపు వెళ్లిపోయారని ఆయన అన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా ఉంటే రాష్ట్రానికి కాంగ్రెసు పీడ విరగడై ఉండేదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ తండ్రి వైయస్సార్ అవినీతి వారసత్వాన్నే కాకుండా ముఖ్యమంత్రి వాసత్వాన్ని కూడా కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్సార్ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన విమర్శించారు. అవినీతి సూత్రధారి వైయస్ రాజశేఖర రెడ్డి అని, డబ్బులు తీసుకోవడం కూడా సోనియాకు వైయస్ నేర్పించారని, ఇప్పుడు డబ్బులు తీసుకోకపోతే సోనియాకు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. భారతదేశానికి చెందిన 73 లక్షల కోట్ల నల్లధనాన్ని విదేశాల్లో దాచి పెట్టారని, 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో 2 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయానుభవం లేదని, తెలుగు కూడా సరిగా మాట్లాడలేరని ఆయన అన్నారు.

English summary
Telugudesam president N Chandrababu naidu refutes Chiranjeevi for merging Prajarajyam Party in Congress. He said Chiranjeevi has ditched poor people by merging his party in Congress. He also criticised CM Kiran Kumar Reddy for his lack of experience in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X