హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్‌కి చిరంజీవి ఎంట్రీ చిక్కులు: బొత్స, డిఎస్‌కు అంతే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనం కాంగ్రెసు‌లో కొందరు ముఖ్య నేతలకు దెబ్బ తగిలినట్టే ఉంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, మంత్రి బొత్స సత్యనారాయణ వంటి నేతలకు చిరంజీవి రాక పెద్ద దెబ్బే. చిరంజీవి కాంగ్రెసు‌లోకి రావడం ద్వారా 2014 ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం ప్రచారం చేయనుంది. ఇప్పటికే ఇటు పీఆర్పీ, అటు కాంగ్రెసు నేతలు అదే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చిన తర్వాతే చిరు పార్టీలోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ తాను 2014 ఎన్నికలకు ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకునే వీలు లేకుండా పోయింది. ఇది పార్టీపైన, ప్రభుత్వంపైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

వచ్చే ఎన్నికలలో చిరంజీవి సిఎం అభ్యర్థిగా ఉండటం వలన కాంగ్రెసు నేతలు చిరు గ్రూపుగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వారు కిరణ్‌ను చూసీ చూడనట్లుగానే ఉంటారు. తన నాయకత్వంలో కాంగ్రెసు ప్రభుత్వం 2014లో ఏర్పడుతుందని ప్రజలకు చెప్పుకునే అవకాశం కూడా సిఎంకు లేకుండా పోయింది. కాంగ్రెసు గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. దివంగత వైఎస్ సిఎం అయిన తర్వాత గ్రూపు రాజకీయాలకు తెరపడింది. కొద్దో గొప్పో ఉన్నా అవి నామమాత్రంగానే ఉండిపోయాయి. అనంతరం రోశయ్య, కిరణ్ హయాంలో కూడా ఉన్నప్పటికీ కాంగ్రెసు సంక్షోభంలో ఉన్న కారణంగా అవి పెద్దగా కనిపించకుండానే మాయమై పోయాయి. ఇప్పుడు చిరు రావడంతో గ్రూపు రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కిరణ్‌తో పాటు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌కు సైతం చిరు రాక దెబ్బే. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా అధిష్టానం పార్టీకి సంబంధించిన అన్ని పనులను చిరుకు అప్పగిస్తే డిఎస్ పని అంతే. ఇన్నాళ్లుగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ డిఎస్‌కు ప్రత్యేక గ్రూపులు అంటూ ఏమీ పెద్దగా లేవు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కిరణ్ ఉన్నందున పార్టీ వ్యవహారాలను డిఎస్‌కు కాకుండా చిరుకు అప్పగించే అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా డిఎస్ ప్రతిష్టకు భంగకరమే. ఆయన ఎన్నాళ్లనుండో కలలు కంటున్న ముఖ్యమంత్రి పీఠం ఆయనకు ఇక కలగానే మిగలనుంది.

వైఎస్ మరణం తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ముఖ్యనేతగా మారారు. ఆయన ఓ సమయంలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. ఆయనకు ఉత్తరాంధ్రలో మంచి పట్టు ఉంది. ఆయన తన సామాజిక వర్గంతో గట్టి పట్టు సాధించారు. మరో ముఖ్య విషయం ఏమంటే ఇటు తెలంగాణ, ఆటు సీమాంధ్ర ప్రజల ఆమోదం పొందిన వ్యక్తి బొత్స సత్యనారాయణ కావడం గమనార్హం. తెలంగాణ వచ్చినా, రాకున్న తనకు ఏమీ ఇబ్బంది లేదని పలుమార్లు చెప్పారు. అయితే సిఎం, బొత్స, డిఎస్‌లు చిరంజీవి రాకను ఆహ్వానించడం విశేషం. చిరు రాకతో కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Congress Party seniors in very trouble with Chiranjeevi's entry. Congress is well known for group politics. In YSR regime group politics in Congress dissapeared. It may re appear with Chiranjeevi's entry. CM Kirankumar Reddy, PCC President D Srinivas and Minister Botsa Satyanarayana may face trouble with Chiru. There is a talk that Chiranjeevi may be announced CM candidate in 2014 election. So Kiran will loose his chance. If Congress High Command gives Party assignments to Chiru, PCC president DS will loose his position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X