రాజీనామా చేసే ప్రశ్నే లేదు: పార్టీలో ఉండే పోరాటం చేస్తా..!

Errabelli Dayakar Rao
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తనపై వస్తున్న కథనాలను వరంగల్ జిల్లా పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు ఖండించారు. తెలంగాణ అంశంపై తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా దయాకర రావు రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా తిరిగి శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.

దీనిపై ఆయన స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టే ప్రశ్నే లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూనే ఎటువంటి పోరాటమైనా చేస్తానని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుక్కోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం అవసరమైతే పార్లమెంట్‌ ఎదుట ధర్నా కూడా చేస్తామని చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణా బిల్లును ప్రవేశపెడితే తమ పార్టీ ఎంపీలంతా మద్దతిస్తారని ఎర్రబెల్లి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+