మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత కాంగ్రెసు పార్టీ నుంచే వ్యతిరేకత

చాలా కాలంగా జిల్లాకు చెందిన మరో మంత్రి డికె అరుణకు, కృష్ణారావుకు మధ్య పడడం లేదు. దీంతో కృష్ణారావు పర్యటనను అడ్డుకోవడానికి కాంగ్రెసు కార్యకర్తలు రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో కృష్ణారావు పర్యటనకు పూనుకున్నారని స్థానిక కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు. కృష్ణారావు పర్యటనకు సంబంధించిన ఫ్లేక్సీలను, బ్యానర్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 15 మంది కాంగ్రెసు కార్యకర్తలను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications