పదవులు తీసుకుంటాం, తెలంగాణ కేంద్రం పరిధిలో: పీఆర్పీ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవి తన ఆశయాలు సాధిస్తారని మరో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రెండున్నరేళ్లలో చిరంజీవి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని వాటన్నింటినీ తట్టుకున్నారన్నారు. చిరంజీవి కొందరు చేసే గోబెల్స్ ప్రచారాన్ని తట్టుకుంటారని చెప్పారు. కాంగ్రెస్‌లో గ్రూపులకు ఆస్కారం లేదన్నారు. ప్రజాకర్షణ, క్లీన్ ఇమేజ్ చిరంజీవి బలం అని మరో ఎమ్మెల్యే అన్నె రాంబాబు అన్నారు. మంత్రి పదవులు ఇస్తే తీసుకుంటామన్నారు. అయితే పదవులు రాకున్నా ఫరవాలేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications