హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ అధికారి ఆస్తులు రూ.3 కోట్లు: ఇంటిపై ఎసిబి దాడులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: అక్రమ ఆస్తులు ఉన్నాయనే సూచనలు రావడంతో అవినీతి నిరోధక శాఖా అధికారులు బుధవారం హైదరాబాదులోని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిపై దాడులు నిర్వహించారు. రాజధాని నగరంలోని ఉప్పల్‌లో జిహెచ్ఎంసి శానిటరీ సూపర్ వైజర్‌గా పని చేస్తున్న రాధాకృష్ణకు అక్రమ ఆస్తులు భారీగా ఉన్నట్లు ఎసిబి అధికారులు తెలుసుకున్నారు. వారు ఉదయం హబ్సీగూడలోని ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. ఆ దాడులలో ఆయనకు మూడు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు.

రాధాకృష్ణకు మూడు ఇళ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నల్గొండలో, హయత్‌నగర్‌లో ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్‌లో 10 ఎకరాల పొలం ఉన్న కాగితాలను, 9 ఫ్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాధాకృష్ణ బంధువుల ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

English summary
ACB officers raides on GHMC sanitary superviser Radhakrishna's house in Hyderabad on Wednesday. ACB officers found 3 crores worth of wealth. They found 10 acres of agricultural land at Nizamabad and 9 open flats in Nalgonda, Hyderabad. They are searching in Radhakrishna's relative residences also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X