చేతకాకుంటే దిగిపోండి: ఢిల్లీ ధర్నాలో విరుచుకుపడ్డ చంద్రబాబు

Chandrababu Naidu
న్యూఢిల్లీ: కాంగ్రెసు ప్రభుత్వానికి పాలించడం చేతకాకుంటే వెంటనే దిగి పోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బుధవారం థర్డ్‌ఫ్రంట్ ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెసు పార్టీ దేశంలో అవినీతిని ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ఏడేళ్లుగా కాంగ్రెసు పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ధరల పెరుగుదల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉందన్నారు. యూపీఎ పాలనలో ఉల్లి నుండి ఇంటి అద్దె వరకు అన్నింటి ధరలు భారీగా పెరిగిపోయాయని ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వ్యవసాయంపై కేంద్రం దృష్టి పెట్టక పోవడం వలన ఆహార సమస్య నెలకొనే ప్రమాదం పొంచి ఉందన్నారు.

పెట్రో ధరలు చాలాసార్లు పెంచి ప్రజలను వంచించిందన్నారు. పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించకుంటే దిగిపోవాలన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయాయని చెప్పారు. ప్రభుత్వాలను రక్షించుకోవడానికి వాటిని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఎబి బర్దన్, అజిత్‌సింగ్, సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+